Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నీటి వినియోగం, సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్థి సంస్థ ఛైర్మన్ వి ప్రకాశ్ రావు అన్నారు. నీటి ఎబిఇన్‌బెవ్, వాటర్‌ఎయిడ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా పలు ఎన్‌జిఒలతో కలిసి తెలంగాణ నీటి కన్సారియం ఏర్పాటు చేశాయి. ఈ సందర్బంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక నీటి ప్రాజెక్టులతో రాష్రంలో భూగర్బ జలాలు 4-6 మీటర్లు పెరిగాయన్నారు.