Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం :కబీర్ భట్టాచార్య
హైదరాబాద్ : ఉద్యోగులు పదవీవిరమణ చేశాక...వారిపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా కిమ్స్ హాస్పిటల్ లిమిటెడ్‌తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టై అప్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో..యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.నరేష్, కార్పొరేట్ రిలేషన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా..కబీర్ భట్టాచార్య మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంక్-ఎగ్జిక్యూటివ్ హెల్త్, యూనియన్ బ్యాంక్-జనరల్ హెల్త్ అనే రెండు ప్యాకేజీలు ఉద్యోగులకు అంది స్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ హైదరాబాద్ డిప్యూటీ జోనల్ హెడ్ ఎన్‌విఎస్ యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.