Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి ఘటన విచారకరమని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులను శిక్షించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి ఆర్‌ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను, అతని కుటుంబ సభ్యులను శుక్రవారం ఆర్‌ఐసీయూ డీఎంఈ రమేష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.గోపితో కలిసి మంత్రి వెళ్లి పరామర్శించారు. వివరాలు తెలుసుకున్నారు. ఆర్‌ఐసీయూను పరిశీలించి విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. అనంతరం ఆస్పత్రిలో విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శానిటేషన్ నిర్వహిస్తున్న ప్రయివేటు ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టామని, ఆర్‌ఐసీయూ బాధ్యతలు చూస్తున్న నాగార్జునరెడ్డిపై విచారణ ఉంటుందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధ్యులను విచారించి సస్పెండ్ చేయడంతోపాటు సూపరింటెండెంట్ బదిలీ జరిగిందన్నారు. ఓరుగల్లు నగరాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. పాత సెంట్రల్ జైల్ ప్రాంతంలో అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తోపాటు, పీఎంఎస్‌వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. కాగా, ఎంజీఎంకు సాత్విక్ రూరల్ అండ్ యూత్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా మూడు కోట్ల విలువైన పరికరాలను సంస్థ ఉచితంగా అందజేసింది. మంత్రి వెంట వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్, ఆర్‌ఎంఓ డాక్టర్ మురళి, డాక్టర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.