Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్తమ డీఎంహెచ్‌ఓలుగా ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, జనగామ జిల్లాల డీఎంహెచ్‌ఓలు డాక్టర్ నరేందర్, డాక్టర్ చందూ నాయక్, డాక్టర్ మహేందర్ అవార్డులను అందుకోనున్నారు. వీరితో పాటు ఆరుగురు ఉత్తమ మెడికల్ ఆఫీసర్లు, ఎనిమిది మంది ఉత్తమ ఏఎన్‌ఎంలకు మంత్రి అవార్డులివ్వనున్నారు.