Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అచ్ఛేదిన్‌ కాదు... ముంచేదిన్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 07,2022

అచ్ఛేదిన్‌ కాదు... ముంచేదిన్‌

- దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలి
- బాదుడు ఆపకపోతే.. ప్రజల తిరస్కరణే
- ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయల పెట్రోపన్ను
- పెట్రో భారాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి
మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరల బాదుడు ఆపకపోతే ప్రజలు తిరస్కరించడం ఖాయమని హెచ్చరించారు. మోడీ కాలం అచ్చేదిన్‌ కాదు ముంచేదిన్‌ అని విమర్శించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. 'ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతున్నది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్‌గా తిరిగొస్తున్నది. అందుకే, కేంద్రం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నాను' అని తెలిపారు. సబ్‌కాసాథ్‌ సబ్‌ కా వికాస్‌ అని గప్పాలు చెప్పుకునే మోడీ పాలనలో సబ్‌ కా సత్తేనాశ్‌లా దేశం తయారైందని వాపోయారు.
దోపిడీ కూడా దేశం కోసం ధర్మం కోసమేనా?
దేశంలోని 26 కోట్ల కుటుంబాలపై రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్ను వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపీనేనని కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయల పెట్రో పన్నును కేంద్రం దోచుకుందని ఆరోపించారు. ఈ దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా అని ప్రశ్నించారు. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో సామాన్యులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసిన మోడీ ప్రధాని అయ్యాక ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. 2014లో ముడిచమురు ధర రూ.105 డాలర్లు అనీ, మోడీ వచ్చాక ఒకానొక దశలో సుమారు 20 డాలర్ల దిగువకు తగ్గిందని గుర్తుచేశారు. 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర సుమారు రూ.70.51, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 53.78గా ఉండేదని తెలిపారు. నేడు పెట్రోల్‌ రూ. 118.19 కి, డీజిల్‌ 104.62కు చేరిందని విమర్శించారు. 2014కు ముందుకు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.9.48గా ఉండేదనీ, మోడీ సర్కారు దాన్ని రూ.32.98కి పెంచిందని విమర్శించారు. ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసన రావడంతో దాన్ని రూ.27.90కి తగ్గించిందని తెలిపారు. ఎక్సైజ్‌ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్రమంత్రులతో పాటు వాట్సాప్‌ యూనివర్సిటీ బ్యాచ్‌ సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేల్చేశారు. కరోనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన దౌర్భాగ్యఘనత మోడీ సర్కారుదేనని విమర్శించారు.
పెట్రో సెస్సుపై రాష్ట్రాలకు దక్కేది గుండుసున్నానే
2014 నుంచే రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలకు మోడీ సర్కారు పూనుకున్నదని కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరిట రూ.18, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను వసూలు చేస్తున్నదని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ. 30 రూపాయలకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో మోడీ సర్కార్‌ వసూలు చేస్తోందనీ, అందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానేనని వివరించారు. తెలంగాణలో 2015 నుంచి ఇప్పటిదాకా వ్యాట్‌టాక్స్‌ నయాపైసా కూడా పెంచలేదనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.
ఎన్నికలొస్తే పెట్రోల్‌ రేట్లు పెరగవనే ఆలోచనలోకి ప్రజలు
'దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలి. కానీ బీజేపీ అవకాశవాద, అసమర్థ విధానాలతో తరచూ ఎన్నికలు వస్తే పెట్రోలు ధరల పెంపు ఆగుతుందన్న ఆలోచనల్లోకి ప్రజలు వెళ్లిపోయారు' అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలు గమ్ముగా ఉండి ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే పెట్రోభారాన్ని మోపుతున్నదని విమర్శించారు. గత 15 రోజుల్లో 13 సార్లు పెంచడం దారుణమని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు గెలిపించిన పాపానికి. మోడీ ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ ఇదేనా అని ప్రశ్నించారు.
ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రేయిన్‌ సంక్షోభాన్ని సాకుగా చూపెట్టడం దారుణమని విమర్శించారు. లోక్‌ సభలో పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రి రామేశ్వర్‌ చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. కరోనా సమయంలో పేదలకు పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్క్షిన్ల ఖర్చును పెట్రోల్‌ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించడం దారుణమని విమర్శించారు. పెట్రోరేట్ల ప్రభావంతో పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరిగి సామాన్యుల బతుకులు దినదినగండంగా మారాయని వాపోయారు. గ్యాస్‌ బండ మోయలేని గుదిబండగా మారిందనీ, చివరకు మోడీ చెప్పిన పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. పెట్రోల్‌ రేట్ల దెబ్బకు కార్లు, బైకులు వాడని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ మాటల్ని ప్రజలు సీరియస్‌గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.