Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీి సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశసంపదను కార్పొరేట్ యాజమాన్యాలకు దోచిపెడుతూ ఊడిగం చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం కూరేళ్ళ గ్రామంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన మోత్కూర్ పట్టణ, మండల, ఆత్మకూరు ప్రాంతీయ స్టడీ సర్కిల్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల పొట్టకొడుతూ పెద్దల కడుపు నింపుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.39.45 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రజలకు దక్కింది నామమాత్రమేనని తెలిపారు. ఇప్పటివరకు రూ.10.50 లక్షల కోట్లు కార్పొరేట్లు ప్రభుత్వానికి మొండి బకాయిలుగా ఎగ్గొట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీి సభ్యులు బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్స, తదితరులు పాల్గొన్నారు.