Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోయిన ధాన్యం ట్రాక్టర్లు
నవ తెలంగాణ- మిర్యాలగూడ
మద్దతు ధర కోసం రైతులు ఆందోళనకు దిగారు. దాంట్లో మిల్లుకు వచ్చిన ధాన్యం ట్రాక్టర్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో జరిగింది. గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీకర్ రైస్ మిల్లులో సన్నరకం ధాన్యానికి తక్కువ ధర వేస్తున్నారని శుక్రవారం ఉదయం రైతులు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం మిల్లు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు రూ.1960 ఇవ్వాలని ఆదేశించినా మిల్లర్లు 100 నుంచి 150 రూపాయ లు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యంలో నాణ్యత ఉన్నప్పటికీ ధర తగ్గించి ఇబ్బందులకు గురి చేస్తు న్నారన్నారు. మద్దతు ధర ఇవ్వాలని కోరితే ధాన్యం కొనేది లేదంటూ ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అధికా రులు చర్యలు తీసుకొని మద్దతు ధర ఇప్పించాలని కోరారు. రైతుల ఆందోళనతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మిల్లర్లతో మాట్లాడారు. మద్దతు ధర ఇచ్చేందుకు వారు అంగీకరించడంతో ఆందోళన విరమించారు.