Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్ట్ సంజీవనిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-అమీన్‌పూర్
హైదరాబాద్ మెడికల్ డివైజెస్ పార్కు, తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో మరో ముందడుగు పడిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ నిర్మించిన ఆసియాలో పెద్దదైన స్టెంట్ల తయారీ, పరిశోధనా యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. కోవిడ్ వంటి దుర్భర పరిస్థితుల్ని అధిగమించి ఎస్‌ఎంటీ తమ ప్రాజెక్టు ప్రారంభించటం గొప్ప విషయమని కొనియాడారు. ప్రపంచ స్ధాయిలో సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్కు పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు. 2017లో డివైస్ పార్కు ఏర్పాటుచేసిన నాటి నుంచి ఎన్నో ఉత్పత్తులు జరు గుతున్నాయని తెలిపారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎస్‌ఎంటీ ఉత్పత్తులను ప్రారంభించిందని గుర్తుచేశారు. మెడికల్ ఉత్పత్తులను 80 శాతం పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటు న్నామని, ఆ పరిస్థితిని అధిగమించేందుకు మెడికల్ డివైస్ పార్కు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మ కంగా మెడికల్ డివైస్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా ఇతర దేశాల మెడికల్ ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వయం ఉత్పత్తులకు నాంది పలికిందన్నారు. మెడికల్ డివైస్ పార్కు ద్వారా ఎందరో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.