Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతుసంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈమేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టం కోసం సెలక్ట్ కమిటీని నియమిస్తానని లిఖితపూర్వక హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు కమిటీని నియమిం చలేదని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గ్యారెంటీ ధరలు లేకపోవడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.యేటా 13వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, వీటి నివారణ కోసం కనీస చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు కనీస మద్దతు ధరల చట్టం తీసుకరావాలని డిమాండ్ చేశారు. చట్టం సాధన కోసం జరుగుతున్న ఆందోళనలో రైతులు, ప్రజాసంఘాలు, మేధావులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.