Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లను వెంటనే విడుదల చేయాలి
- ఏప్రిల్ 25న కలెక్టరేట్ల ముందు ధర్నాలు: ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పల్లె ప్రకృతి వనాల్లో వికలాంగులకు ఉపాధి కల్పించాలనీ, పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లను వెంటనే విడుదల చేయాలని వికలాంగుల హక్కువల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ఈ నెల 25న కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నటు ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు చేసినట్టు పేర్కొన్నారు.గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకృతి వనరులను ఏర్పాటు చేస్తుందని ఇందులో వికలాంగులకు ఉపాధికల్పించాలని డిమాండ్ చేశారు. మానసిక వికలాం గులు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్కొని రాజు ,మహమ్మద్ ఆరిఫా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు వి ఉపేందర్, జే. దశరథ్, రాష్ట్ర నాయకులు రంగారెడ్డి, భుజంగ్ రెడ్డి, లింగన్న, వెంకన్న, ప్రకాష్, శశికళ రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.