Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీపక్ శర్మతో గంగుల భేటీ
- రైతులను ఇబ్బంది పెట్టొదని విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎఫ్‌సీఐ సహకరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్రాన్ని కోరారు. తెలంగాణలోని వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతుల్ని ఇబ్బంది పెట్టొదనీ, గన్నీలు, గోదాములు, ర్యాకుల కేటాయింపులను పెంచాలన్నారు. ప్రతీ నెల 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలనీ, ధాన్యం సేకరణ పర్యవేక్షణకు ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ నోడల్ అధికారులను నియమించాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజన్ దీపక్‌శర్మతో మంత్రి భేటీ అయ్యారు. శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే 34 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని కోరారు.