Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఈనెల 20 నుంచి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం కోచింగ్ కేంద్రాలను ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కోచింగ్ కేంద్రాలను ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి వర్సిటీకి రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోచింగ్ ప్రారంభమయ్యాక విద్యార్థుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరిన్ని నిధులు ఇచ్చే అవకాశమున్నది. కోచింగ్‌ను ఇచ్చేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఓ అధికారిని వర్సిటీలు ఇప్పటికే ఎంపిక చేశాయి. పోటీపరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, కోచింగ్ ఇచ్చే గదులను రెడీ చేశాయి. అయినా ఇంత వరకు ఏ వర్సిటీలోనూ కోచింగ్ ప్రారంభం కాలేదు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.