Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణ సౌకర్యం, మార్కెట్ సౌకర్యం కల్పించాలి
- చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ
- రాష్ట్ర కన్వీనర్ ఎంవి.రమణ
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టి వాటి చుట్టూ తిప్పటం తప్ప వృత్తిదారుల ఉపాధికి సరైన చర్యలు తీసుకోవడం లేదని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవి.రమణ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో కొండ వెంకన్న అధ్యక్షతన చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృత్తిదారులకు రాష్ట్ర కార్పొరేషన్, ఫెడరేషన్ ఉన్నప్పటికీ.. అవి వారి అభివృద్ధికి ఎలాంటి కృషీ చేయడం లేదన్నారు. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.5678 కోట్లు మాత్రమే కేటాయించి చిన్నచూపు చూసిందన్నారు. వృత్తిదారులకు ఉపాధి కలగాలంటే ముడిసరుకు, రుణ సౌకర్యం, మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప వృత్తిదారుల బాగోగులను పట్టించుకోవడం లేదని, ఉపాధికి సరైన చర్యలు చేపట్టడం లేదని అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురించి గొప్పలు చెప్పే నేతలు.. రాజ్యాంగంలో వారు చెప్పినట్టు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి కోసం వృత్తిదారులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా ప్రయివేటు వారికి అప్పగించడం వల్ల సామాజిక తరగతులు ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ గంజి మురళీ మాట్లాడుతూ.. 50 ఏండ్లు నిండిన వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని కోరా రు. వృత్తుల వారీగా బడ్జెట్ పెంచాలని, వృత్తిబంధు పెట్టాలని డిమాండ్ చేశారు. మండలాల వారీగా సదస్సులు నిర్వహించి సమస్యలను ప్రభుత్వానికి తెలియజే యాలని సమావేశం తీర్మానించింది. అనంతరం నియోజకవర్గ కన్వీనర్‌గా కొండ వెంకన్నను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌగాని సీతారాములు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు ఉప్పల గోపాలు,
జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, నేలపట్ల నరసింహ, యాదయ్య, నక్కెరకంటి యాదయ్య, కాశయ్య, ముక్కాల యాదయ్య, మారయ్య, జిన్నుకుంట్ల లింగస్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు.