Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీ, వినియోగదారులకు అసాధారణ సేవలు అందించినందుకు గాను తమకు కీలక అవార్డ్ దక్కిందని సిగాచీ ఇండిస్టీయల్ లిమిటెడ్ తెలిపింది. ఇటీవల జరిగిన తొమ్మిదవ ఎడిసన్ ఇండియా ఎస్‌ఎంఈ అవార్డులు -2022లో తమకు టాప్ 100 ఎంస్‌ఎంఇ అవార్డును అందుకున్నట్టు పేర్కొంది. దీన్ని సిగాచీ ఎండి, సిఈఓ అమిత్ రాజ్ సిన్హాకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మా అందజేశారని తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ అహార,ఔషదాల తయారీకి ఉపయో గించే మైక్రోక్రిస్టాలైన్ సెల్యూలోస్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.