Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంపై కేంద్రం వివక్ష
- కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల (ఎస్‌టీపీఐ) ఏర్పాటులో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపుతున్నదనీ, దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్టు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాసారు. కేంద్రం ప్రకటించిన 22 నూతన ఎస్‌టీపీఐల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడాన్ని ఆయన లేఖలో తప్పుపట్టారు. ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని ఆక్షేపించారు. ఇప్పటికే హైదరాబాద్ ఐటీఐఆర్ రద్దు చేసిన విషయాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర ప్రభుత్వ పురోగతిని ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కరెంటు చార్జీలు ఎక్కువ: వినోద్ కుమార్
బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కరెంటు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనీ, దాన్ని తక్షణం మానుకోవాలని హితవు పలికారు. ఆయా రాష్ట్రాల విద్యుత్ టారిఫ్ రేట్లతో పోలిస్తే తెలంగాణ అతి తక్కువ కరెంటు చార్జీలు ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రా ల్లో కేవలం 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నా రనీ, తెలంగాణలో అన్ని రంగాలకూ 24 గంటల విద్యుత్ ఉన్నదనీ తెలిపారు. తెలంగాణతో పోలుస్తూ పలు రాష్ట్రాల గృహ విద్యుత్ చార్జీల వివరాలను ఆయన విడుదల చేశారు.