Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నవతెలంగాణ - మల్లాపూర్
మాల మాదిగ స్వాములు భోజనం వడ్డిస్తే తాము తినబోమంటూ.. అన్నదాన కార్యక్రమంలో అందరి ముందు దళితులను కొందరు గ్రామస్తులు అవమానించారు. ఈ ఘటన హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని నడికూడా గ్రామంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా చందాలు పోగు చేసుకుని అన్నదానం నిర్వహించారన్నారు. అన్నదాన కార్యక్రమంలో దళిత హనుమాన్ మాలధారణ స్వాములు వడ్డన చేస్తుండగా.. అక్కడికి వచ్చిన కొంతమంది గ్రామస్తులు మాల మాదిగ స్వాములు వడ్డన చేస్తే మేము తినబోమని, అందరిముందు అవమానించి ప్రత్యేక టేబుల్ తీసుకుని పక్కకు వెళ్లి వడ్డించుకుని తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దళితులు తీవ్ర మనోవేదనకు గురై తహసీల్దార్ రవీందర్, ఎస్‌ఐ నవీన్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దళితులని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్ డిమాండ్ చేశారు.