Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బంజారాహిల్స్ రాడిసన్ బ్లూలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. పబ్ నిర్వాహకుడు అభిషేక్, మేనేజర్ అనిల్‌ను పోలీసులు 4 రోజులు విచారించారు. సోమవారం నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగిన నిందితులు నోరుమెదపలేదు. నింది తులు సహకరించకపోవడంతో ఈ కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. పబ్‌పై దాడులు, నిందితుల అరెస్టు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అవి కేసుకు బలాన్ని ఇచ్చేలా లేకపోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ నెల 3న ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడి జరిగిన తర్వాత నిర్వాహకుడు అభిషేక్, అనిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు డెస్క్ మీద ఉన్న ఐదు మిల్లిగ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.