Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్‌ఎస్ అనేది... తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి ప్రతీక అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఈనెల27న టీఆర్‌ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవా న్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో కేటీఆర్ ఆ దినోత్సవాన్ని నిర్వహించే స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... మొత్తం మూడు వేల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు.ఆహ్వానాలు అందిన వారు మాత్రమే హెచ్‌ఐసీసీకి రావాలని సూచించారు. సభకు వచ్చే వారికి పాస్‌లు జారీ చేస్తామని వివరించా రు. ఇందుకు సంబంధించి సోమవారం జీహెచ్‌ఎమ్‌సీ నేతలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్క రించుకుని... మొత్తం12,769 గ్రామాలు,3,600 పట్టణాల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.