Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ 25లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలి : కేవీపీఎస్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజు పల్లికి చెందిన రామకృష్ణను రూ 10లక్షల సుఫారీ ఇచ్చి అత్యంత కిరాతకంగా హత్య చేసి పాతి పెట్టిన యాదగిరిగుట్టకు చెందిన వీఆర్‌వో వెంకటేష్‌ను, హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. కులదురహంకార హత్యను తీవ్రంగా ఖండించారు. రామకృష్ణ గౌడ్ గతంలో యాదగిరిగుట్టలో పోలీస్ హోంగార్డుగా ఉంటున్న సందర్భంలో అక్కడే భార్గవి అనే యువతితో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. గుప్త నిధుల తవ్వకాల సందర్భంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం పేరిట ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడని పేర్కొన్నారు. గత మూడేండ్లుగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నప్పటికీ భార్గవి తండ్రి కక్ష సాధింపుతో స్థానిక రౌడీ షీటర్‌కు రూ 10లక్షల రూపాయలు ఇచ్చి అత్యంత కిరాతకంగా హత్య చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌వోగా ఉన్న వెంకటేష్‌తోపాటు హత్యలో పాల్గొన్న అందరినీ కఠినంగా శిక్షించాలనీ, భర్తను కోల్పోయిన భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, ఆయన కూతురు చదువుకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. భార్గవి కుటుంబానికి రూ 25 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.