Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాల మరణం కలిచివేసింది : తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాతూరి సాల్మన్‌రాజు తిరుగులేని నైతికతతో నైపుణ్యానికి, వృత్తికి అంకితమైన ఒక ప్రొఫెషనల్ ఫోటోజర్నలిస్ట్ అని తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి కొనియాడారు. అతని అకాల మరణం ఫోటోజర్నలిజానికి తీరనిలోటు అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ఆంధ్రజ్యోతి దినపత్రికలో సాల్మన్‌రాజు పని చేశారనీ, శనివారం రాత్రి గుండె పోటు వచ్చి తుదిశ్వాస విడిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోటో జర్నలిస్టుగా తాము ఆయనతో కలిసి పని చేశామని గుర్తు చేశారు. అతనితో కలిసి పని చేసిన సందర్భంలో పంచుకున్న ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయనీ, అతను తన కెమెరాను నిజమైన క్షణాల సాక్షిగా ఉపయోగించాడని కొనియాడారు. సాల్మన్‌రాజు మృతికి సంతాపం, ఆయన కుటుంబసభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు.