Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుల కోసం గాలింపు
- కేసు విచారణకు ప్రత్యేక బృందం
- విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెదక్ జిల్లా రామయంపేట్‌కు చెందిన తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతుల సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియా, ఆడియో ఆధారంగా ఏడుగురిపై 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏ1గా రామయంపేట్ మున్సిపల్ చైర్మెన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏ2గా మార్కెట్ కమిటీ చైర్మెన్ సరాఫ్ యాదగిరి, ఏ3 ఐరన్ పృథ్వీరాజ్, ఏ4 తోట కిరణ్, ఏ5 కన్నాపురం కృష్ణ గౌడ్, ఏ6 సరాఫ్ స్వరాజ్, ఏ7 తాండూరు పీఐ నాగార్జున గౌడ్ పేర్లను చేర్చారు.
మృతుడు సంతోష్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. నెల రోజుల నుంచి రామాయంపేట్ మున్సిపల్ చైర్మెన్ పళ్ళ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ సరాఫ్ యాదగిరి ఫోన్ నెంబర్ నుంచి సంతోష్‌కు ఫోన్లు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.