Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి,
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
- ఘనంగా టీచర్స్ భవనం ప్రారంభం
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కేంద్రంగా టీచర్స్ భవన్ ఉంటుందని, ఏజెన్నీ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్య బలోపేతం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన టీచర్స్ భవనంను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఎస్ యూటీఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా భవన నిర్మాణం చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలు నిలయంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను చైతన్యపరిచే విధంగా భవన్ ఉపయోగపడాలని, ఈ భవనం నేటి నుంచి అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సభలో మాట్లాడుతూ.. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తోందని చెప్పారు. ప్రారంభ సభకు ముందు మీటింగ్ హాల్‌ను రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య, ఆఫీస్ రూమ్‌ను రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, గెస్ట్‌రూమ్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా భవాని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి బండి నాగేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, కోశాధికారి లక్ష్మారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నర్సింహారావు పాల్గొన్నారు.