Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆర్మూర్‌టౌన్
గల్ప్ దేశం బెహరాన్‌లో గుండెపోటుతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ వాసి ఆదివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తుడుం శ్రీనివాస్(46) స్థానికంగా ఉపాధి లేక 15 ఏండ్లుగా గల్ఫ్ దేశమైన బెహరాన్‌లో ఉపాధి కోసం వెళ్లాడు. అక్కడ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు.