Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడ్రోజులు మత్తు ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన దుండగులు
- తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలు
- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
- నిందితుల్లో ఒకరు అధికార పార్టీ కౌన్సిలర్ కుమారుడిగా గుర్తింపు
నవతెలంగాణ- కోదాడరూరల్
సూర్యాపేట జిల్లాలో మానవ మృగాలు బరితెగించారు. శీతల పానీయంలో మత్తు మందు కలిపి యువతిని ఆటోలో తీసుకెళ్లి మూడ్రోజులు సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ ఘటన కోదాడ పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకార ం..పట్టణానికి చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకు లు గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేసి బయటకు రమ్మన్నారు. దీంతో ఆమె బయటకు వెళ్లగానే ఆటోలో నయానగర్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లి బంధించారు. శీతలపానీయంలో మత్తుమందు కలిపి తాపించి మూడ్రోజులుగా లైంగికదాడి చేశారు. చింతహింసలు పెట్టారు. అంతేకాకుండా తీవ్రంగా కొట్టారు. ఆదివారం సాయంత్రం మత్తు నుంచి తేరుకున్న బాధితురాలు బంధువులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకొచ్చింది.చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతర ం బాధితురాలి తల్లి 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలించారు. ఘటనపై సీఐ నర్సింహారావును వివరణ కోరగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వైద్య పరీక్ష కోసం శాంపిల్స్‌ను సూర్యాపేట ఆస్పత్రికి పంపామన్నారు. నిందితుల్లో కోదాడ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ కౌన్సిలర్ కుమారుడు ఉన్నాడని తెలిపారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.