Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట్ పీజీ విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన రాష్ట్ర పీజీ కౌన్సిలింగ్-రెండో మాపప్ రౌండ్‌ను రద్దు చేయాలని పలువురు నీట్ పీజీ 2020-21 విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ లోని ఉస్మానియా వైద్యకళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ అభినవ్, డాక్టర్ జమీల్ హుస్సేన్, డాక్టర్ హర్షిక, డాక్టర్ సాగర్ మాట్లా డారు. రాష్ట్రంలో చివరి రౌండ్‌ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్‌ఎస్) నిబంధ నలకు విరుద్ధంగా నిర్వహిం చారని ఆరోపించారు. ఫ్రీ ఎగ్జిట్‌కు అనుమతించడం ఎంసీసీ నిబంధనలకు వ్యతిరే కంగా ఉందని తెలిపారు. ఆల్ ఇండియా మాపప్ రౌండ్‌లో రాష్ట్రానికి చెందిన దాదాపు 50 మందికి సీట్లు కేటాయించి రద్దు చేశారని చెప్పారు. ప్రతి రాష్ట్రం మాపప్ రౌండ్‌ను జాతీయ స్థాయిలో మాపప్ రౌండ్ నిర్వహించిన తర్వాతే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా రాష్ట్రం ముందుగానే నిర్వహించి గందరగోళానికి తెరలేపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా మాపప్ రౌండ్ మార్చి 31న ఉంటే రాష్ట్రంలో మార్చి 23, 24 తేదీల్లో నిర్వహించడమే కాకుండా అడిషనల్ రౌండ్‌ను మార్చి 29, 30 తేదీల్లో ముగిం చారని వెల్లడిం చారు. అఖిల భారత స్థాయిలో మాపప్ రౌండ్ రద్దు కావడంతో సుప్రీం కోర్టు ఆదేశాలతో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలు మాపప్ రౌండ్‌ను రద్దు చేశాయని గుర్తుచేశారు.
రాష్ట్ర మాపప్ రౌండ్‌లో సీట్లు పొందిన తమను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తప్పుదోవ పట్టించి రాజీనామా చేయించిందని ఆరోపించారు. అఖిల భారతస్థాయిలో ఆరు వేల మంది వరకు సీట్లు కేటాయించినప్పటికీ అదనంగా 146 సీట్లు తోడవ్వడంతో ఆ కౌన్సిలింగ్ రద్దయిందని తెలిపారు. తిరిగి అఖిలభారత స్థాయిలో సీట్లు రాకుండా కాళోజీ యూనివర్సిటీ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు.
మంత్రిని కలిశాం.... అయినా
కరోనా కాలంలో విలువైన సేవలందించిన తమకు ఆ మహమ్మారి కారణంగా ఆలస్యంగా నీట్ పరీక్ష నిర్వహించారని గుర్తుచేశారు. తీరా పరీక్ష రాసి ప్రతిభావంతులుగా చెప్పుకోదగ్గ ర్యాంకులు సాధించామన్నారు. ఆ ర్యాంకులతో సీట్లు పొందితే నిబంధనలకు విరుద్ధంగా రాజీనామా చేయించి తమను అటు, ఇటూ కాకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై న్యాయం కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావును కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించా మన్నారు. మంత్రి సూచన మేరకు... యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.
అందరిని కలుస్తాం...
న్యాయస్థానంలో పోరాడుతాం..
పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ విషయంలో సుప్రీం కోర్టు ఈ నెల ఏడున ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ విషయమై అన్ని పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులను కలిసి సహకారం కోరుతామనీ, అదే సమయంలో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటాన్ని చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీట్లు కోల్పోయిన పలువురు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.