Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వనపర్తి పట్టణంలో నూతన శాఖను తెరిచింది. దీంతో హైదరాబాద్ సర్కిల్‌లో 67 శాఖలకు విస్తరించినట్లయ్యిందని ఆ బ్యాంక్ తెలిపింది. ఈ శాఖ ప్రారంభోత్సవంలో జోనల్ మేనేజర్ సంజీవన్ నిఖార్, సర్కిల్ హెడ్ ప్రసాద్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలను అందిస్తున్నామని సంజీవన్ నిఖార్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. వనపర్తి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ బ్యాంక్ సేవలను పొందవచ్చన్నారు.