Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో111 రద్దుపై రేవంత్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను రద్దు చేయడమంటే, అది మోసగాడి మరో మోసంలా ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు గురువారం రేవంత్ ట్వీట్ చేశారు. ఈ జీవోపై 16.07.2007లో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదనీ, మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ నాయకుల రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ డ్రామా! ఆడుతున్నారని పేర్కొన్నారు.
జీవో111 కేసీఆర్ సొంత ఎస్టేట్ పంచాయితా? : దాసోజు శ్రవణ్
జీవో 111 కేసీఆర్ సొంత ఎస్టేట్ పంచాయితా? ఆ జీవోపై హైపర్ కమిటీ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సొంత ఇంటి వ్యవహారంలా కేసీఆర్ జీవోలను తీసుకురావడం ఎంత వరకూ న్యాయం? అని నిలదీశారు. ఆ జీవో పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. అందులో లక్ష ఎకరాలను టీఆర్‌ఎస్ పెద్దలు బెదిరించి తీసుకున్నదేని ఆరోపించారు. ఇప్పుడు వారికి మేలు చేస్తూ ఈ జీవోను ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారని విమర్శిం చారు.జీవో 69 హైకోర్టు ఇచ్చిన తీర్పుకు, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ద మని పేర్కొన్నారు. ఆ జీవో వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.