Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు అంకురాలకు, 12 మంది ఆవిష్కర్తలకు అవార్డులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామాలను ప్రభావితం చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా ఆరు అంకుర సంస్థలు, 12 మంది నూతన ఆవిష్కర్తలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందజేసింది. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఆవిష్కరణ మహౌత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ కంపెనీలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నూతన ఆవిష్కరణల్లో తెలంగాణ ప్రపంచ హబ్‌గా మారుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు (ఎంఎస్‌ఆర్), తెలంగాణ సీఐఓ డాక్టర్ శాంత తౌతమ్ తదితరులు పాల్గొన్నారు.