Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రికి జర్నలిస్టు అసోసియేషన్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలల్లో 50శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కోరింది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అసోసియేషన్ నేతలు వినతిపత్రం సమర్పించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం కళాశాలల్లో 25 శాతం ఉచిత విద్యనందించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగొని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, నాయకులు ఎర్రమాద హరి నారాయణ, కోశాధికారి పాపని నాగరాజు, ముత్యం ముఖేష్ గౌడ్, బుడంపల్లి నిరంత్ తదితరులు పాల్గొన్నారు.