Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మలేరియా కేసుల తగ్గింపునకు కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. గత ఆరేండ్లలో తెలంగాణలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్రం పేర్కొంది. ఫలితంగా రాష్ట్రం కేటగిరీ -2 నుంచి కేటగిరీ-1లోకి మారింది. ఈ క్రమంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర అధికారులను సత్కరించనున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వారిని అభినందించారు.