Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖకు లోకల్‌క్యాడర్ జీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యాశాఖలో అర్హత కలిగిన అన్ని పోస్టులకూ ప్రభుత్వ ఉపాధ్యాయులకే పదోన్నతులివ్వాలని లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (జీటీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను శనివారం జీటీఏ అధ్యక్షులు ఎం వీరాచారి కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018పై హైకోర్టులో స్టే ఉందని తెలిపారు. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 ప్రకారం లోకల్ క్యాడర్‌లో ఉన్న ప్రభుత్వ టీచర్లకే అర్హత కలిగిన పదోన్నతులివ్వాలని కోరారు. హైకోర్టు, కేశవులు, వేమారెడ్డి కేసులో తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే లోకల్ క్యాడర్ పోస్టుల పదోన్నతులకు అర్హులని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2021, జనవరిలో అన్ని శాఖల్లో లోకల్ క్యాడర్ ఉద్యోగులకు పదోన్నతులిచ్చిందని గుర్తు చేశారు. అదే విధంగా విద్యాశాఖలో అర్హత కలిగిన లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్ని రకాల పదోన్నతులు కల్పించాలని కోరారు. తమకు పదోన్నతులిచ్చేందుకు ఎలాంటి న్యాయపర మైన ఇబ్బందుల్లేవని తెలిపారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. సోమవారం జరిపే చర్చలకు లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాన్ని పిలవాలని కోరారు.