Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్‌ఎస్ నాయకులు ప్రయివేటు వైద్యవిద్యా కళాశాల్లో పీజీ సీట్ల దందాపై చేస్తున్నారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. ఈమేరకు శనివారం గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రయివేటు వైద్య కళాశాలల్లో సీట్లను బ్లాక్ చేసి, కోట్ల రూపాయిలకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. వైద్య సీట్ల దందాలో మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజరుకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారంటూ విద్యార్ధులు ఆరోపిస్తున్నారని తెలిపారు. నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగులను ఆసరా చేసుకుని ఏటా రూ. వంద కోట్లమేర సీట్లను బ్లాక్ చేస్తున్నారని విమర్శించారు.