Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావు పిలుపు
నవతెలంగాణ-కల్చరల్
మరణించిన లేదా బ్రెయిన్ డెడ్ అయినవారిని దహనమో, ఖననమో చేసే కన్నా వారి అవయవాలు అవసరమైనవారికి అందిస్తే దైవ రూపంలో వారిని బతికించిన వారు అవుతారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇటీవల మరణించిన కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆమె కోరిక మేరకు నల్గొండ ప్రభుత్వ వైద్యశాలకు, కమ్యూనిస్ట్ నాయకులు నారాయణ సతీమణి వసుమతి భౌతికకాయాన్ని తిరుపతి వైద్యశాలకు కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఇచ్చారని, వీరిని ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని అవయవదానం చేయాలని ఆయన కోరారు. రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్ నిర్వాహణలో అవయవ దానం చేసిన 85 మంది కుటుంబ సభ్యుల సత్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. వివిధ అవయవాల కోసం ఎనిమిది వేల మంది పేర్లు నమోదు చేసుకొని ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తోందని ఆరోగ్య శ్రీ పథóకంలో అవయవ మార్పిడి చేసుకున్న వారికి పది లక్షలు ఇవ్వటంతో పాటు ప్రతి నెలా 20వేెలు మందుల కోసం ఇస్తోందని తెలిపారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లలో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తొలి అవయవ మార్పిడి నిమ్స్‌లో 1989లో జరిగిందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 3800 మంది అవయవదానం ద్వారా లబ్ది పొందారని తెలిపారు. వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ కే.రమేష్‌రెడ్డి స్వాగతం పలుకుతూ పది సంవత్సరాలలో 1021 కుటుంబాల వారు అవయవ దానం చేశారని తెలిపారు.