Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాల వర్షానికి తడిచిన ధాన్యం
నవతెలంగాణ-సిరికొండ/డిచ్‌పల్లి
అప్పటివరకు తీవ్ర ఎండకొట్టడంతో ధాన్యం ఆరబెట్టుకోగా.. ఒక్కసారిగా మేఘాలు కమ్మి వర్షం కురవడంతో రైతులు ధాన్యం కాపాడుకునేందుకు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలోని తూంపల్లి, కొండాపూర్, ముషీర్‌నగర్‌తో పాటు డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దాంతో ఆరబెట్టిన ధాన్యం చుట్టూ నీరు చేరి తడిసి ముద్దయింది. టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో ఉరుకులు పరుగుల మీద ఇండ్లకు హడావుడిగా వెళ్లి కవర్లు తెచ్చి కుప్పలపై కప్పి ధాన్యం కాపాడుకునేందుకు యత్నించారు. కాగా పలు చోట్ల ఈదురుగాలుల ధాటికి వరి పైరు నేలకొరిగింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.