Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 13న పున:ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఆదివారం నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం (2022-23) జూన్ 13వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించడం, వేసవి సెలవులు ప్రకటించడమనే ప్రక్రియలు రెండేండ్లుగా జరగడం లేదు. షెడ్యూల్ కంటే ముందే విద్యాసంస్థలను మూసేసిన సంగతి తెలిసిందే. రెండు విద్యాసంవత్సరాల తర్వాత ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం విశేషం. ఆదివారం నుంచి జూన్ 12వ తేదీ వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకే వేసవి సెలవులుంటాయి. మే 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తారు. ఉన్నత పాఠశాలల్లో ఆ విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.