Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ - వనపర్తి
ప్రజా పోరాటాలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మతోన్మాదం పెరిగిందన్నారు. జిల్లాలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, గిరిజనులు, దళితులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేరళలో నిర్వహించిన పార్టీ జాతీయ మహాసభలో చర్చించినట్టు చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. బడా పెట్టుబడిదారుల అప్పులను రద్దు చేసినట్టు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల రుణం మాఫీ చేయమని ప్రకటించి రైతు వ్యతిరేకిగా మిగిలిందన్నారు. కరోనా తర్వాత దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి క్షీణించిందనీ, అవేమీ పట్టించుకోని కేంద్రం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో నిత్యావసర ధరలూ పెరగడంతో ప్రజలపై మరింత భారం మోపిందన్నారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. దళితులు దళితబంధుకు నోచుకోవడం లేదన్నారు. పోడు భూములు సాగు దారులకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫి కషన్ విడుదల చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించు కోవాలన్నారు. ఇప్పట ికైనా ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడి పెంచిన ధరలను తగ్గించాలని, లేకుంటే కార్మికులు, ప్రజలను సమీకరించి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. సమా వేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ. జబ్బార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.లక్ష్మి, ఎం. ఆంజనే యులు, డి.బాల్‌రెడ్డి, జీఎస్.గోపి తదితరులు పాల్గొన్నారు.