Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పోరాట యోధుల చరిత్ర గొప్పదనీ, దాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరముందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో ఇతిహాస్ సంకలన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన 'అన్ సంగ్ హీరోస్ ఆఫ్ ఫ్రీడం స్ట్రేగుల్ ఫ్రేమ్ తెలంగాణ రీజియన్ (1857-1948) జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతో మంది వివరాలను వెలుగులోకి తీసుకరాలేదన్నారు. అందుకోసం ప్రత్యేకంగా పరిశోధకుల బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి, నిర్వాహకులు ప్రొఫెసర్ కిషన్‌రావు, ప్రొఫెసర్ మనోహర్‌రావు, ప్రొఫెసర్ వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.