Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తికరణ్ పురస్కారాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్ చైర్‌పర్సన్ సిద్ధం వేణు, డీపీవో రవీందర్ అందుకున్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా వారు అవార్డును స్వీకరించారు. అలాగే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు మద్దికుంట (ముస్తాబాద్ మండలం), మండేపల్లి (తంగల్లపల్లి మండలం) అవార్డులను జిల్లా పంచాయితీ అధికారి రవీందర్,స్థానిక సర్పంచ్‌లతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, అవార్డు గ్రహీతలు, ఆ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.