Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీకి తోడైన రేవంత్
- తప్పుడు ఆరోపణలతో గవర్నర్‌కు లేఖ రాశారు :
- రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం సేకరణకు మోకాలడ్డుతున్న కేంద్రంలోని బీజేపీ... తద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్నదని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. ఆ పార్టీకి ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ తోడయ్యారని అన్నారు. మెడికల్ కాలేజీల సీట్లకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో గవర్నర్‌కు ఆయన లేఖ రాశారని తెలిపారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ గంగాధరగౌడతో కలిసి పల్లా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.మూడు వేల కోట్ల నష్టాన్ని భరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధపడిందని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పారు. వారికిప్పుడు రేవంత్ తోడయ్యారని ఎద్దేవా చేశారు. తనకు మెడికల్ కాలేజీ లేదన్న విషయం కూడా తెలుసుకోకుండానే ఆయన ఆరోపణలు చేశారని విమర్శించారు.