Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విద్యార్థుల్లో సజనాత్మకత పెంచేందుకు అక్షర విద్యాసంస్థలు 'నైట్ క్యాంప్' కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఎల్బీ నగర్‌లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ లో 600 మంది, ఏఎస్‌రావు నగర్ క్యాంపస్ లో 250 మంది విద్యార్థులు ఈ నైట్ క్యాంప్ లో పాల్గొన్నారు. టగ్ ఆఫ్ వార్, బాంబ్ బ్లాస్ట్ , ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, ఆర్టిలరీ, కెమెల్ రైడ్, క్యాంప్ ఫర్, స్లెయిడర్స్ విభాగంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యాసంస్థల సీఈవో అర్శనపల్లి మదన్ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థుల మధ్య స్నేహభావం, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ నైట్ క్యాంప్ ఈ నైట క్యాంప్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ అక్షర్ ప్రిన్సిపాల్ రమణి వారణాసి, ఎస్ ఎస్ రావు నగర్ ప్రిన్సిపాల్ కను ప్రియ వాహి తదితులు పాల్గొన్నారు.