Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 587 ఎస్‌ఐ 16,027 కానిస్టేబుల్ పోస్టులకు నియామకాలు
- అభ్యర్థుల వయోపరిమితి మూడేండ్లు పెంపు
- మే 2 నుంచి 20 వరకు దరఖాస్తు గడువు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్ సిగల్ ఇస్తు సర్కారు సోమవారం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈ మేరకు ఎస్‌ఐ తత్సమాన 587 పోస్టులకు, 16,027 కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానిస్తూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మెన్ వివి శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థులు మే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయనకోరారు. కాగా అభ్యర్థుల వయో పరిమితిని మరో మూడేండ్లపాటు సడలించారు. ప్రస్తుతం చేపట్టిన నియామకాలలో పోలీసులతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసులు, ఎస్‌పీఎఫ్ విభాగాలలో నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లను జారీచేశారు. ఇందులో సివిల్ ఎస్‌ఐలు 414, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్లు 66, సీపీఎల్ ఎస్‌ఏఆర్ విభాగంలో పురుష ఎస్‌ఐ పోస్టులు 5, టీఎస్‌ఎస్‌పీ ఎస్ పురుష పోస్టులు 23, ఎస్‌పీఎఫ్ విభాగంలో ఎస్‌ఐ పోస్టులు 12, ఫైర్ సర్వీసుల విభాగంలో ఎస్‌ఎఫ్‌ఓ పోస్టులు 26, జైళ్ల శాఖలో డిప్యుటీ జైలర్‌ల పోస్టులు 8, పోలీసు కమ్యూనికేషన్ విభాగంలో ఎస్‌ఐ పోస్టులు 22, పీటీవో విభాగంలో ఎస్‌ఐ పోస్టులు 3, ఫింగర్ ప్రింట్స్ విభాగంలో ఎఎస్‌ఐ పోస్టులు 8 ఉన్నాయి. మొత్తం కలిపి 587 పోస్టులకు గాను ఎస్‌ఐ స్థాయి అధికారుల నియామకాలను బోర్డు చేపడుతున్నది. ఇక కానిస్టేబుల్ తతత్సమాన పోస్టులలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 4965 పోస్టులు, ఆర్మ్‌డ్ రిజర్వు పీసీ పోస్టులు 4423 పోస్టులు, సీపీఎల్ పీసీ పోస్టులు 100, టీఎస్‌ఎస్‌పీలో కానిస్టేబుళ్ల పోస్టులు 5010, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టులు 390, ఫైర్ సర్వీసుల విభాగంలో ఫూర్‌మెన్ పోస్టులు 610, జైళ్ల శాఖలో వార్డర్ పోస్టులు 136, మహిళా వార్డర్ పోస్టులు 10, పోలీసు కమ్యూనికేషన్‌ల విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు 262, పీటీవోలో కానిస్టేబుల్ పోస్టులు 21, పీటీవో డ్రైవర్ పోస్టులు 100లు కలిపి మొత్తం 16,038 పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా సాధారణంగా ఎస్‌ఐ పోస్టులకు అభ్యర్థులు 25 ఏండ్లు దాటరాదు. కాగా వీరి వయసును మరో మూడేండ్ల పాటు సడించారు. ఎస్‌ఐ పోస్టులకు అభ్యర్థులు డిగ్రీ తత్సమాన పరీక్షలను పాసై ఉండాలి. కాగా ఓసీ అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టుల కోసం వేయి రూపాయలను దరఖాస్తు ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులను క్రెడిట్ కార్డు, డెబట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ.ఇన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను చేసుకోవాలి. తమ అధికారిక వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఎస్‌ఐ పోస్టుల కోసం ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.ఐదు వందలను దరఖాస్తు ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇక కానిస్టేబుల్ పోస్టుల కోసం అభ్యర్థులు మే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తమ అధికారిక వెబ్ ఐసైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.800ను, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.500లను దరఖాస్తు ఫీజు కింద చెల్లించాలి. ఈ పోస్టులకు సైతం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని మరో మూడేండ్ల పాటు పొడిగించారు. ఇక అభ్యర్థుల వయో పరిమితి మొదలుకుని అర్హతల వరకు వారికి అవసరమైన వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తిగా వివరించడం జరిగిందని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మెన్ వివి శ్రీనివాసరావు తెలిపారు.