Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
- వరంగల్‌లో భారీ ధర్నాసీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
- జీడబ్ల్యూఎంసీ ఎదుట ధర్నా
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ, సీఐటీయూ, ఐద్వా, కేవీపీఎస్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జీడబ్ల్యూఎ ంసీ కమిషనర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడారు. బల్దియా పరిధిలోని రంగశాయిపేట, ఉర్సు కరీమాబాద్, రామన్నపేట, ఎంహెచ్‌నగర్, తదితర కాలనీల్లో తాగునీటి, రోడ్లు, డ్రెయినేజీ, ఇతర సమస్యలతో ప్రజలు సతమతమతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడిచినా పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించడం లేదని ఆరోపించారు. ఇంటి స్థలాలకు పట్టాలు, అర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు, మంజూరు చేయాల్సి ఉందన్నారు. మిషన్ భగీరథ పనులతో ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. చిన్నపాటి వర్షానికే ముంపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ముందస్తు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా పరిరక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల, సీఐటీయూ నాయకులు సింగారపు బాబు, కేవీపీఎస్ నాయకులు ఆరూరి కుమార్, సాగర్, బషీర్, ముక్కెర రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.