Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంక్ వాష్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో ఇంక్ వాష్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత అంశాల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించనున్నారు. ఆస్కితో కలిసి వాష్ ఇన్నోవేషన్ హబ్‌ను పురపాలక శాఖ ఏర్పాటు చేసింది. మే 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో ఇంక్ వాష్ కార్యక్రమం జరగనున్నది.
ఉస్మానియా డాక్టర్లకు హరీశ్ రావు అభినందనలు.
ఆరు నెలల్లో 50 కీళ్లమార్పిడి శస్త్రచికిత్సలు, 60 రోజుల్లో 250 గుండె చికిత్సలు చేసిన ఉస్మానియా డాక్టర్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభినందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వాస్పత్రుల్లో అందిస్తున్నదని పేర్కొన్నారు.