Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తత్కాల్ ద్వారా ఫీజు చెల్లింపు గడువు ఈనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పివి శ్రీహరి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల లేదా జూన్‌లో దూరవిద్య పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు రూ.500, ఇంటర్మీడియెట్ విద్యార్థులు రూ.వెయ్యి తత్కాల్ ఫీజు చెల్లించాలని కోరారు.