Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజాన్ పండగ వేళ కుటుంబాల్లో విషాదం
నవ తెలంగాణ జహీరాబాద్
ఇనుపచువ్వలు సేకరించేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని లింగాయత్ సమాజం శ్మశానవాటికలో మంగళవారం ఉదయం జరిగింది. రంజాన్ పండుగ వేళ ఈ ఘటన జరగడంతో మీర్ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 30న హైదరాబాద్‌లో ఉంటున్న ముల్తాని (16) రంజాన్ పండుగ నేపథ్యంలో ఐడీఎస్‌ఎన్‌టీలో ఉన్న అమ్మమ్మ వాళ్లింటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం మిత్రుడు అజీజ్ (13)తో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం లింగాయత్ సమాజం శ్మశానవాటికలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికెళ్లి పరిశీలించారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి మృతదేహాలను గుర్తించారు. కాగా ఆ ఇద్దరు చిన్నారులు భవనంపై ఉన్న ఇనుపచువ్వలను సేకరించేందుకు వెళ్లి విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.