Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
- వచ్చే మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రెండు, మూడ్రోజులు కింద పడ్డ వర్షాలతో తగ్గిన ఎండలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భోజ్(ఆదిలాబాద్)లో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో వచ్చే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో శుక్రవారం 31 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.