Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎంని సంతోషపెట్టేందుకే ఈ నిర్ణయం : రాజాసింగ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రూప్‌వన్ పరీక్ష ఉర్దూలో ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ సభలో బండి సంజరు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదనీ, చేతనైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పాలని సూచించారు. ముమ్మాటికీ ఎంఐఎంని సంతోషపెట్టడం కోసమే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.ఉర్దూలో ఎగ్జామ్ పెడితే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరగదా? వారి గురించి ఏమైనా ఆలోచన చేస్తావా సీఎం అని ప్రశ్నించారు.