Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మదర్స్ డే సందర్భంగా అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ ప్రయాణంలో ఓ షరతు కూడా విధించారు. ఐదేండ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో ప్రయాణించే తల్లులు మాత్రమే అన్ని బస్ సర్వీస్‌లలో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తు న్నట్టు వివరించారు. ఈ ఆఫర్ మే 8వ తేదీ ఆదివారం మాత్రమే అమల్లో ఉంటుంది. పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు అన్ని బస్సులలో ఆ రోజున ఈ ఉచిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చని ఆయన తెలిపారు.