Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వేసవికాలంలో ప్రయాణీకులు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్న దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయా బస్సు స్టేజీల సంఖ్యను పెంచాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్టేజీల సంఖ్య పెంచడం వల్ల ఆ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఎమ్‌డీ ఆదేశాలతో శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు ప్రధాన రూట్లలో నడుపుతున్న పుష్ఫక్ బస్సుల పికప్ పాయింట్లను పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీన్ని తక్షణం అమల్లోకి తేనున్నారు.