Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే మంత్రిత్వ శాఖ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్‌టిపిసి) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ-2) రెండో దశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాలను దష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. దీనికి అదనంగా ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి పరీక్షకు హాజరయ్యే ఎస్‌సి/ఎస్‌టి అభ్యర్థుల ట్రావెల్ అథారిటీ ఇప్పుడు ''ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఎగ్జామ్'' ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారికి జారీ చేయబడిన ట్రావెల్ అథారిటీ ప్రకారం (అర్హతకు అనుగుణంగా) ''ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఎగ్జామ్'' ప్రత్యేక రైళ్లలో సీటు/బెర్తు రిజర్వు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.